గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మరియు విస్తరణ

కేశినేని నానిగారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి, ప్రజాశ్రేయస్సు మరియు సంక్షేమంకు పెద్దపీట వేస్తూ, ఇటీవలి కాలంలో యావత్ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం అద్భుతమైన ప్రగతిని సాధించేలా కృషి చేసారు. అలాంటి కార్యక్రమాల్లో ప్రధానమైనది గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మరియు విస్తరణ ప్రాజెక్ట్. ఇదివరకు ఉన్న మౌలిక సదుపాయాలతో కేవలం సంవత్సరానికి కేవలం 6 లక్షల ప్రయాణికులకే సేవలందించే అవకాశం ఉండేది. కాని ప్రస్తుతం జరుగుతున్నా విస్తరణ పూర్తయితే, సంవత్సరానికి దాదాపు 50 లక్షల సాధారణ (డొమెస్టిక్) ప్రయాణికులకి మరియు అంతర్జాతీయ ప్రయాణికులకి సేవలందించే స్థాయికి చేరుకుంటుంది. జాతీయ మరియు అంతర్జాతీయ విమానప్రయాణ సేవలు అందించే దిశలో, మరింతగా విస్తరించిన స్థలంతో, మెరుగైన మౌలిక సదుపాయాలతో, విజయవాడ విమానాశ్రయం ఒక అధునాతనమైనదిగా మరియు వినూత్నమైనదిగా రూపాంతరం చెందుతోంది.

కేశినేని నానిగారు ప్రజల శ్రేయస్సుకై నిర్విరామంగా కృషిచేస్తూ, విజయవాడ నుండి జాతీయ మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణ సేవల్ని మరింత మెరుగుపరిచేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే దగ్గరిలోని ప్రాంతాలకి కూడా విజయవాడ ప్రధానమైన విమానప్రయాణ కేంద్రంగా మారే విధంగా, ప్రస్తుతం విజయవాడ విమానశ్రాయాన్ని అభివృద్ధి మరియు విస్తరణలకి శ్రీకారం చుట్టారు.

విమానాశ్రయపు ఇదిరవరకటి విస్తీర్ణానికి అదనంగా 687 ఎకరాల స్థలాన్ని జతపరిచి, మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి పరుస్తున్నారు. దీంతో అదనంగా ఒక టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి, తద్వారా ప్రయాణికులకు మెరుగైన ఫ్లైట్-బోర్డింగ్ టైమింగ్స్ అందుబాటులోకి తెచ్చేవిధంగా పనులు జరిగాయి. నిర్మాణం పూర్తైన కొత్త టెర్మినల్ ను జాతీయ విమాన సర్వీసులకు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ ను అంతర్జాతీయ విమానాల బోర్డింగ్ మరియు అన్-బోర్డింగ్ కి ఉపయోగిస్తున్నారు.

గన్నవరం విమానాశ్రయం ప్రాజెక్ట్ విజయవాడ పట్టణానికి మరింత ప్రగతిని కలిగించేలా, తద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విజయవాడ పట్టణం మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తున్నారు.

కేశినేని నాని గారు అలుపెరుగని కృషి చేసి, కేంద్రవిమానయానశాఖ భారతీయ విమానయాన ప్రాధికారసంస్థ మరియు ఎయిరిండియాలతో సంప్రదింపులు జరిపి, విజయవాడ నుండి న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, మొదలగు పట్టణాల నుండి విమాన సర్వీసులు ప్రారంభమయ్యేలా చేశారు. దీనివల్ల విజయవాడ విమానాశ్రయంకు మరింత మెరుగైన ప్రయాణసౌలభ్యం ఏర్పడింది. తద్వారా విమాన రవాణారంగంలో విజయవాడకు ప్రధానమైన నగరంగా గుర్తింపు లభించింది.