కేశినేని

కేశినేని నాని గారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక విభిన్న శైలిని కలిగిన ప్రజానాయకుడు. తన నియోజకవర్గ పరిధిలో ప్రజల జీవనశైలిలో గుణాత్మకమైన మార్పు తెచ్చేవిధంగా, సమగ్రమైన ప్రగతి ఫలాలు వారికి అందేవిధంగా నిరంతరం ఆలోచించే కార్యశీలి. తన ప్రాంత అభివృద్ధి కోసం, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన ఉపాది అవకాశాలు అందేలా ప్రణాళికలను రూపొందించడానికి నిరంతరం ఆసక్తి కనబరిచే నాయకుడు. నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కేశినేని నాని గారు, “టాటాట్రస్ట్” యొక్క సౌజన్యంతో తన నియోజకం సమగ్రమైన ప్రగతి ఫలాలను పొందేలా కృషిచేస్తూ ఒక చరిత్రని సృష్టించారు. వారి సహకారంతో ఎన్నో విభిన్న పథకాలు, ఇదివరకెన్నడు చూడని విధంగా, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల అభివృద్దికోసం శ్రీకారం చుట్టారు. తన స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణలో, వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తూ, “విజయవాడ” పట్టణాన్ని మెరుగైన ప్రజాజీవనానికి అనువైన, సౌకర్యవంతమైన మరియు ఆకర్షణీయమైన పట్టణంగా మార్చే దిశలో పయనిస్తున్నారు. విజయవాడ పట్టణాన్ని వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తూ యావత్ భారతదేశానికే తలమానికంగా మార్చే విధంగా కృషి చేస్తున్నారు. కేశినేని నాని గారు నిష్పాక్షికమైన అభిప్రాయాలతో మరియు సహేతుకమైన ఆలోచనాదోరణితో పనిచేసే నవీనతరం నాయకుడు. మెరుగైన ఫలితాలను పొందేదిశలో, సాంప్రదాయబద్దమైన ఆలోచనల్ని అధునాతన సాంకేతిక విజ్ఞానంతో మేళవించి కార్యక్రమాలను అమలు చేసేలా అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి వినూత్న శైలిలో పనిచేసే కేశినేని నాని గారిని “ఆధునిక సామాజిక సంస్కర్త”గా గుర్తించడం చాల సముచితం.

కేశినేని భవన్, విజయవాడ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ సమస్యల్ని, తమకు అవసరమైన అభివృద్ధి పనుల్ని అభ్యర్థించుకునేందుకు, తమ వాణిని వినిపించేందుకు కేశినేని భవన్ లోని సమావేశమందిరం వేదికగా ఉంటుంది. ప్రజలకి సేవచేయాలన్న ఆకాంక్షతో మరియు ప్రజాసేవయే దేశసేవ అని ప్రగాఢంగా నమ్మే కేశినేని భవన్ సిబ్బంది ప్రజలకి ఎల్లవేళలా సహాయపడతారు. కేశినేని భవన్ లో ఎం.పి కేశినేని నాని గారిని నేరుగా కలిసి, తమ సమస్యలను చర్చించుకునే మరియు పరిష్కరించుకునే అరుదైన సౌకర్యం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కేశినేని నాని గారు తన దృష్టికి వచ్చిన సమస్యలను, ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ప్రత్యేక సలహాదారుల సమక్షంలో త్వరితగతిన పరిష్కరించబడేలా కృషి చేస్తారు.