గన్నవరం విమానాశ్రయం

కేశినేని నానిగారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి, ప్రజాశ్రేయస్సు మరియు సంక్షేమంకు పెద్దపీట వేస్తూ, ఇటీవలి కాలంలో యావత్ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం అద్భుతమైన ప్రగతిని సాధించేలా కృషి చేసారు. అలాంటి కార్యక్రమాల్లో ప్రధానమైనది గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మరియు విస్తరణ ప్రాజెక్ట్. ఇదివరకు ఉన్న మౌలిక సదుపాయాలతో కేవలం సంవత్సరానికి కేవలం 6 లక్షల ప్రయాణికులకే సేవలందించే అవకాశం ఉండేది. కాని ప్రస్తుతం జరుగుతున్నా విస్తరణ పూర్తయితే, సంవత్సరానికి దాదాపు 50 లక్షల సాధారణ (డొమెస్టిక్) ప్రయాణికులకి మరియు అంతర్జాతీయ ప్రయాణికులకి సేవలందించే స్థాయికి చేరుకుంటుంది. జాతీయ మరియు అంతర్జాతీయ విమానప్రయాణ సేవలు అందించే దిశలో, మరింతగా విస్తరించిన స్థలంతో, మెరుగైన మౌలిక సదుపాయాలతో, విజయవాడ విమానాశ్రయం ఒక అధునాతనమైనదిగా మరియు వినూత్నమైనదిగా రూపాంతరం చెందుతోంది.

కేశినేని

కేశినేని నాని గారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక విభిన్న శైలిని కలిగిన ప్రజానాయకుడు. తన నియోజకవర్గ పరిధిలో ప్రజల జీవనశైలిలో గుణాత్మకమైన మార్పు తెచ్చేవిధంగా, సమగ్రమైన ప్రగతి ఫలాలు వారికి అందేవిధంగా నిరంతరం ఆలోచించే కార్యశీలి. తన ప్రాంత అభివృద్ధి కోసం, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన ఉపాది అవకాశాలు అందేలా ప్రణాళికలను రూపొందించడానికి నిరంతరం ఆసక్తి కనబరిచే నాయకుడు. నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కేశినేని నాని గారు, “టాటాట్రస్ట్” యొక్క సౌజన్యంతో తన నియోజకం సమగ్రమైన ప్రగతి ఫలాలను పొందేలా కృషిచేస్తూ ఒక చరిత్రని సృష్టించారు. వారి సహకారంతో ఎన్నో విభిన్న పథకాలు, ఇదివరకెన్నడు చూడని విధంగా, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రజల అభివృద్దికోసం శ్రీకారం చుట్టారు. తన స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణలో, వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తూ, “విజయవాడ” పట్టణాన్ని మెరుగైన ప్రజాజీవనానికి అనువైన, సౌకర్యవంతమైన మరియు ఆకర్షణీయమైన పట్టణంగా మార్చే దిశలో పయనిస్తున్నారు.

విజయవాడ పట్టణాన్ని వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తూ యావత్ భారతదేశానికే తలమానికంగా మార్చే విధంగా కృషి చేస్తున్నారు. కేశినేని నాని గారు నిష్పాక్షికమైన అభిప్రాయాలతో మరియు సహేతుకమైన ఆలోచనాదోరణితో పనిచేసే నవీనతరం నాయకుడు. మెరుగైన ఫలితాలను పొందేదిశలో, సాంప్రదాయబద్దమైన ఆలోచనల్ని అధునాతన సాంకేతిక విజ్ఞానంతో మేళవించి కార్యక్రమాలను అమలు చేసేలా అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు.

  కేశినేని భవన్, పిన్నలవారి వీధి, విజయవాడ పిన్ కోడ్: 520002, ఆంధ్రప్రదేశ్